సంబంధిత వార్తలు
- భార్య నుదుటపై కాల్చిన ఎన్నారై భర్త... తాను గుండెల్లో బుల్లెట్ దించుకున్నాడు..
- కుటుంబ కలహాలతో భార్యను కాల్చిచంపిన భర్త.. టెక్సాస్‌లో తెలుగు భర్త దారుణం
- పెళ్లి విందును రద్దు చేశారు.. అమరుల కుటుంబాలను అలా ఆదుకున్నారు..
- జాలి లేని భర్త కంటే కుక్కే బెటర్... పెంపుడు శునకం కోసం భర్తకు విడాకులు
- కింద పడిన భార్య.. అలా చేసిన భర్త... 3 నిమిషాల్లో ముగించేశారు...
బర్గర్ తీసుకురాలేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య..
భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు విడాకులకు దారి తీస్తున్నాయి. తాజాగా బర్గర్ తీసుకురాలేదని ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడింది. అబుదాబిలో ఇది జరిగింది.
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తన భర్తను ఇంటికి తిరిగివచ్చేటప్పుడు బర్గర్ మీల్ తీసుకురమ్మంది. స్నేహితులతో మచ్చట్లు చెప్పుకుంటూ భర్త రెస్టారెంట్‌కు వెళ్లడం మరచిపోయి తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి వచ్చాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త విడాకులకు దారి తీసింది.
విడాకులకు దరఖాస్తు చేసుకున్న మహిళకు, ఆమె భర్తకు జడ్జి ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని లాయర్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారమైతే వారిద్దరూ భార్యాభర్తలుగా కొనసాగుతారు. అలా కాని పక్షంలో ఆమె కోరుకున్నట్టుగా విడాకులు తీసుకోవచ్చన్నారు.
తర్వాతి కథనం
