కింద పడిన భార్య.. అలా చేసిన భర్త... 3 నిమిషాల్లో ముగించేశారు...

divorce
ప్రీతి చిచ్చిలి| Last Modified సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:26 IST)
ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణమైపోయాయి. చిన్నచిన్న కారణాలకే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కే జంటల సంఖ్య అన్ని దేశాలలోనూ రాన్రానూ పెరిగిపోతోంది. అయితే ఈ జంట గురించి వింటే ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఏంటో చూద్దాం.

కువైట్‌లో ఒక జంట పెళ్లి కోసం న్యాయస్థానానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌పై సంతకాలు చేసారు. ఆ తర్వాత కోర్టు నుండి బయటికి వస్తూ పెళ్లి కూతురు తూలి కిందపడిపోయింది. అది చూసి వరుడు కంగారుగా లేపడానికి బదులుగా పరుష పదజాలంతో తిట్టడం ప్రారంభించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన వధువు వెంటనే కోర్టులోకి వెళ్లి తమకు విడాకులు కావాలని కోరింది.

వెంటనే కేసు విచారణ చేసి జడ్జి వీరికి విడాకులు మంజూరు చేసారు. ఇదంతా కేవలం మూడు నిమిషాలలో జరిగిపోయిందట. బహుశా ఇది ప్రపంచ రికార్డ్ అని స్థానిక మీడియా అభిప్రాయపడింది.దీనిపై మరింత చదవండి :