బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (13:15 IST)

పెళ్లి విందును రద్దు చేశారు.. అమరుల కుటుంబాలను అలా ఆదుకున్నారు..

పుల్వామా ఘటనలో అమరులైన కుటుంబాలను ఆదుకునేందుకు యావత్తు దేశ ప్రజలు ముందకొస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి జంట అమర వీరులకు రూ.5లక్షలను సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు. గుజరాజ్‌కు చెందిన వజ్రాల వ్యాపారి తన కుమార్తె పెళ్లి విందును రద్దు చేసి రూ. 11 లక్షల రూపాయలను అమరుల కుటుంబాలకు, రూ.5 లక్షలను సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు. 
 
వ్యాపారి దేవాషి మానెక్ తన కుమార్తె అమీ వివాహాన్ని సింపుల్‌గా జరిపించారు. పెళ్లి అనంతరం నిర్వహించాల్సిన విందును రద్దు చేసి ఆ సొమ్మును అమరుల కుటుంబాలకు విరాళంగా ప్రకటించారు. 
 
గుజరాత్‌లోని వడోదరలో ఓ జంట పెళ్లికి ముందు ఊరేగింపు నిర్వహించి పుల్వామా అమరులకు ఘనంగా నివాళులర్పించింది. దేశాన్ని సంరక్షించేందుకు 13లక్షల సింహాలున్నాయని  రాసి వున్న ప్లకార్డులను పట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని అమరులకు నివాళులర్పించారు.