బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (15:36 IST)

కాశ్మీర్‌లో వేర్పాటువాదులకు భద్రత తొలగింపు

పుల్వామా ఉగ్రదాడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఇందులోభాగంగా, కఠిన చర్యలకు ఉక్రమించింది. ఇప్పటివరకు వేర్పాటువాదులకు కల్పిస్తూ వచ్చిన భద్రతను ఉపసంహరించింది. అలాగే వారికి ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర సదుపాయాలు కూడా నిలిపివేసింది. జమ్ముకాశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని భావించిన ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 
 
వేర్పాటువాద నేతలు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, బిలాల్ లోన్, అబ్దుల్ ఘనీ భట్, హషీం ఖురేషీ, షబీర్‌షాలకు భద్రతను తొలగించారు. సాయంత్రంకల్లా భద్రత, వాహనశ్రేణి ఉపసంహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. సాయంత్రం వరకు కర్ఫ్యూ ఉంటుందని ఆర్మీ ప్రకటించింది. 
 
ఇదిలావుండగా, జూబ్లీహిల్స్ సీఆర్‌పీఎఫ్ కార్యాలయంలో అమర జవాన్లకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కేటీఆర్ స్నేహితులు కూడా మరో రూ.25లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. రూ.50 లక్షల చెక్కును సీఆర్‌పీఎఫ్ ఐజీ జీహెచ్‌పీ రాజుకు కేటీఆర్ అందజేశారు. 
 
పుల్వామా ఉగ్రదాడి ఎంతగానో కలచివేసిందని కేటీఆర్ అన్నారు. కేవలం జవాన్ల వల్లే మనమంతా క్షేమంగా ఉన్నామన్నారు. జ‌వాన్ల వ‌ల్ల‌నే దేశం సుర‌క్షితంగా ఉంటోంది. అమ‌రుల త్యాగాల‌ను దేశం ఏనాటికి మ‌ర్చిపోదు. వారి త్యాగాలు ఎప్ప‌టికీ త‌మ గుండెల్లో నిలిచిపోతాయి. ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాను అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.