గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (15:20 IST)

సీఆర్పీఎఫ్ జవాన్ల మరణం వ్యక్తిగతంగా తీరని లోటు : విక్కీ కౌశల్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం వ్యక్తిగతంగా తీరని లోటని బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం యురి. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఆవేదన వ్యక్తంచేశాడు. 
 
దీనిపై ఆయన పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో జవాన్ల మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నాడు. విక్కీ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాద సమస్యకు చెక్ పెట్టేలా వారికి తగిన సమాధానమివ్వాలని అభిప్రాయపడ్డాడు. 
 
దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి జవాన్ల కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని, జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేయాలని కోరాడు. అమరజవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా కూడా ప్రజలంతా మద్దతుగా నిలబడాల్సిన అవసరముందని చెప్పారు.