సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:14 IST)

ఆకాశ్ పూరీ కొత్త లుక్.. సోషల్ మీడియాలో ప్రశంసల జోరు

టాలీవుడ్‌లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ సినిమాలలో హీరోగా ప్రవేశించారు. మొదట్లో కొంత తడబాటుకు గురైనప్పటికీ, మెహబూబా సినిమాలో నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తన కొడుకును సక్సెస్‌ఫుల్ హీరోగా చేయాలనే ఆశ మాత్రం పూరీకి ఇంకా నెరవేరడం లేదు. ఈ రోజు ఉదయం ఆకాష్ పూరీ మరో చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. దీనికి "రొమాంటిక్" అనే పేరును ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు.
 
ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ మరియు స్టోరీని పూరి జగన్నాథ్ అందిస్తుండగా, అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవానికి హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, సీనియర్ నటీమణి రమాప్రభ గారు విచ్చేసారు. 
 
హీరో కళ్యాణ్ మొదటి సీన్‌కు క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌లు పెట్టారు. ఈ సినిమాతో అయినా బ్లాక్‌బస్టర్ హీరో అవుతాడో లేదో మరి ఆకాశ్.