రామ్‌తో చేస్తోన్న సినిమా స్టోరీని పూరీ ముందుగా ఎవరికి చెప్పాడో తెలుసా?
ఎనర్జిటిక్ హీరో రామ్ - డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. పూరి టూరింగ్ టాకీస్ & పూరి కనెక్ట్స్ బ్యానర్ పైన పూరి, ఛార్మి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్‌కి మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.... రామ్‌తో చేస్తోన్న ఇస్మార్ట్ శంకర్ స్టోరీని ముందుగా ఓ హీరోకి వినిపించాడట.
ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. అవును... ఇటీవల విజయ్‌ని పూరి కలిసినట్టు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కథను పూరి విజయ్‌కి వినిపించడాట. అయితే.. విజయ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. కథ నచ్చినా సినిమా చేయలేని పరిస్థితి. పూరి అంతకాలం ఆగే టైపు కాదు. ఏదైనా అనుకున్నాడంటే చకచకా చేసుకుంటూ వెళ్లిపోవడమే. అందుకే ఈ సినిమాని రామ్‌తో సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు సెట్ కాలేదు. భవిష్యత్‌లో పూరి - విజయ్ కలిసి సినిమా చేస్తారేమో చూడాలి మరి..!