సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 31 డిశెంబరు 2018 (20:17 IST)

చార్మి-పూరి నిర్మిస్తున్న సినిమాలో రామ్ హీరో... డీటైల్స్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొంద‌నున్న సినిమా జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీని పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పైన పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించేందుకు ఓ కొత్త అమ్మాయి ఎంపిక చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయి. రామ్ క్యారెక్ట‌ర్ చాలా ర‌ఫ్‌గా.. చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ట‌. పూరి సినిమాల్లో హీరో డిఫ‌రెంట్‌గా ఉంటాడ‌నే విష‌యం తెలిసిందే.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రానికి పండుగాడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది. పూరి తెర‌కెక్కించిన పోకిరి సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌ర్ పేరు పండుగాడు. ఇప్పుడు ఇదే రామ్ మూవీకి టైటిల్‌గా పెట్టాల‌నుకుంటున్నార‌ట‌. ఏప్రిల్ నెలలో షూటింగ్ కంప్లీట్ చేసి మే నెల‌లో ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి... ఈ సినిమా అయినా పూరికి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.