పూరి నెక్ట్స్ మూవీ ఫిక్స్... హీరో ఇతనే..!
డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మెహబూబా సినిమా తర్వాత ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. మళ్ళీ తనయుడుతోనే పూరి సినిమా తీయనున్నట్టు గతంలో ప్రకటించారు. కానీ.. ఏమనుకున్నారో ఏమో కానీ.. ఆకాష్ సినిమాని తన శిష్యుడు అనిల్ కి ఇచ్చారు. పూరి మాత్రం ఈసారి పక్కా హిట్ కొట్టాలనే కసితో కథ రెడీ చేసారట. ఇటీవల పూరి కథ చెప్పడం.. అది ఓకే అవ్వడం కూడా జరిగిందట. ఇంతకీ.. హీరో ఎవరంటారా..? ఎనర్జిటిక్ హీరో రామ్.
అవును.. రామ్‌కి పూరి కథ చెప్పారట. విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేద్దాం అని చెప్పాడట రామ్. ప్రస్తుతం పూరి ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం కోసం బ్యాంకాక్ వెళ్లారట. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారట. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. ఈ సినిమా కోసమే అనుకుంట రామ్ పూర్తిగా తన లుక్‌ని మార్చేసాడు. చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. హీరోలను సరికొత్తగా ప్రజెంట్ చేసే పూరి రామ్‌ని ఎలా చూపిస్తాడో..?