పూరికి హీరో దొరికాడా..? చివరికి అలా ఫిక్సయ్యాడు మరి...
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బష్టర్స్, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్. ఇటీవల కాలంలో ఆయన టైమ్ ఏమాత్రం బాగోలేదు. ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవ్వడం తప్ప... ఆశించిన విజయం మాత్రం రావడం లేదు. తనయుడు ఆకాష్‌తో మెహబూబా సినిమా తీసాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఆకాష్ తర్వాత సినిమాను కూడా పూరినే తీయనున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. పూరి కూడా తన నెక్ట్స్ మూవీ మళ్ళీ ఆకాష్‌తోనే అని ఎనౌన్స్ చేసాడు.
ఆ తర్వాత ఆలోచనలో పడ్డ పూరి ఆకాష్ సినిమాకి కథ మాటలు అందించి దర్శకత్వ బాధ్యతలను మాత్రం తన శిష్యుడు అనిల్‌కి ఇచ్చాడు. తను మాత్రం వేరే హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. బన్నీతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. గోపీచంద్‌తో సినిమా చేయనున్నాడట. ఇటీవల కథా చర్చలు జరిగాయట. త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. గతంలో వీరిద్దరు కలిసి గోలీమార్ తీసారు. మంచి విజయం సాధించారు. మరి.. ఈసారి కూడా ఈ కాంబినేషన్ సక్సస్ సాధిస్తుందేమో చూడాలి.