సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 19 అక్టోబరు 2018 (12:51 IST)

వ‌ర్మ అన్నంత ప‌నీ చేసాడు... ఎన్టీఆర్ దీవెనలు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కే నంటూ ఓపెన్ ఛాలెంజ్

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గ‌తంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. బాల‌య్య - క్రిష్ కాంబినేష‌న్లో ఎన్టీఆర్ బ‌యోపిక్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి వ‌ర్మ త‌ను తీయాల‌నుకున్న సినిమా గురించి ఏం మాట్లాడ‌లేదు సైలెంట్ అయిపోయాడు. దీంతో వ‌ర్మ తీయాల‌నుకున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆగిపోయింది అనుకున్నారు. కానీ.. స‌డ‌న్‌గా ఇటీవ‌ల మ‌ళ్లీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తీయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికీ షాక్ ఇచ్చారు. 
 
ఈ రోజు తిరుప‌తిలో వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకుని ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభిస్తాను. జ‌న‌వ‌రి 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాన‌ని చెప్పారు. చెప్పిన‌ట్టుగానే ఈ రోజు తిరుప‌తిలో వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకుని ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రానికి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ అస‌లు క‌థ అనేది ట్యాగ్ లైన్.
 
యూట్యూబ్‌లో ఈ మూవీ గురించి త‌న వాయిస్‌తో ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. ఇందులో ఎవ‌రు ఎన్టీఆర్ బ‌యోపిక్ తీసినా.. ఎన్టీఆర్ ఆశీస్సులు మాత్రం త‌న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ పైనే ఉంటాయ‌న్నారు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ అని కూడా చెప్పాడు. మ‌రి.. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో... ఎలాంటి వివాదాల‌కు తెర తీస్తుందో చూడాలి.