కుటుంబ కలహాలతో భార్యను కాల్చిచంపిన భర్త.. టెక్సాస్‌లో తెలుగు భర్త దారుణం

murder
Last Updated: మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (11:03 IST)
కుటుంబ కలహాలతో భార్యను కాల్చి చంపాడో తెలుగు భర్త. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం టెక్సాస్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెకరకంటి శ్రీనివాస్ అనే వ్యక్తి టెక్సాస్‌లోని ఓ ఇంధన కంపెనీలో పని చేస్తున్నాడు.

ఈయనకు భార్య, శాంతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఈయన ఇంట్లో నుంచి పెద్ద శబ్దం వినిపించింది. దీంతో ఇరుగు పొరుగువారు అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు... ఇంట్లోకి వెళ్లి చూడగా, అప్పటికే శాంతి, శ్రీనివాస్‌లు రక్తపు మడుగులో పడివున్నారు.

ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఇంట్లో వారి ఇద్దరు పిల్లల్లో కుమారుడు కాలేజీకి వెళ్లివుండగా, కుమార్తె మాత్రం మరో గదిలో చదువుకుంటూ ఉన్నది. అయితే, భార్య శాంతిని చంపిన శ్రీనివాస్.. ఎందుకు చేసుకున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :