సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (11:01 IST)

వెస్ట్ బెంగాల్‌లో అధికార తృణమూల్ ఎమ్మెల్యే కాల్చివేత

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకర్ని దుండగులు కాల్చివేశారు. హత్యకు గురైన ఎమ్మెల్యే పేరు సత్యజిత్ బిశ్వాస్. బెంగాల్‌ రాష్ట్రంలోని నదియా జిల్లాలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఆ పార్టీ అధ్వర్యంలో జరిగిన సరస్వతీ పూజలో పాల్గొన్న ఆయన.. వేదిక నుంచి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బులెట్ల వర్షం కురిపించి పారిపోయారు. 
 
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఆయన మథువా సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ హత్య వెనుక బీజేపీ హస్తముందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.