ప్రముఖ టీవీ యాంకర్ వైసీపీ నుండి టిక్కెట్ ఆశిస్తోందా?

మోహన్ మొగరాల| Last Updated: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:28 IST)
ప్రముఖ టీవీలో యాంకర్‌గా మనందరికీ సుపరిచితురాలైన ఓ వ్యాఖ్యాత రానున్న ఎన్నికల్లో వైసీపీ నుండి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమె ఇప్పటికే సినిమాలలో కూడా నటించింది. బుల్లితెరలో కామెడీ ప్రధానంగా వస్తున్న కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకుంటూ వైసీపీకి చెందిన సీనియర్ యాక్టర్, రాజకీయవేత్త సహాయంతో ఎమ్మెల్యే టికెట్ కోసం లాబీయింగ్ చేస్తోందట. 
 
అయితే ఆ సీనియర్ యాక్టర్‌కే ప్రస్తుతానికి ఎలాంటి హామీ లభించలేదని, అలా జరగడం కుదరదనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే పార్టీకి చెందిన కొంత మంది నాయకులు మాత్రం దీనిని సీరియస్‌గానే పరిగణిస్తున్నారు. 
 
అదేమిటంటే పార్టీ ఇలాంటి వాళ్లను ప్రోత్సహించదని, అన్ని విధాలుగా సీరియస్‌గా, సామర్థ్యం ఉన్న వారినే ప్రోత్సహిస్తుందని, అలాంటి వారి కోసమే ఎదురుచూస్తోందని కొంత మంది అంటున్నారు. ఏదేమైనా మరిన్ని వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.దీనిపై మరింత చదవండి :