సంబంధిత వార్తలు
- సరికొత్త ప్రేమకథా చిత్రంగా అలనాటి రామచంద్రుడు
- పూరీలో రాష్ట్రపతి.. ప్రకృతిపై సుదీర్ఘ పోస్ట్.. సముద్ర తీరం వెంబడి నడుస్తున్నప్పుడు..?
- స్వర్గంలో భూములు అమ్ముతానంటున్న చర్చి ఫాస్టర్..!
- హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్
- చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి.. రైళ్లు నడిపే యోచనలో నాసా!
చంద్రుడిపై భారీ గుహను గుర్తించాం.. ఇటలీ సైంటిస్టులు
Moon
అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 55 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే. ఆర్మ్ స్ట్రాంగ్ దిగిన చోటు నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని గుర్తించామని ఇటలీ సైంటిస్టుల బృందం నిర్ధారించింది.
అగ్నిపర్వతం వెదజల్లిన లావా కారణంగా ఈ బిలం ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ఈ గుహ వెడల్పు కనీసం 40 మీటర్లు ఉంటుందని, పొడవు మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు.
భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైనా భారీ గుహలు ఉండొచ్చని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. దాదాపు 50 ఏళ్లుగా కొనసాగిన ఈ మిస్టరీని తమ బృందం ఛేదించిందని ఇటలీ పరిశోధకులు వివరించారు. ప్రస్తుతానికి ఒక గుహను మాత్రమే కనుగొన్నప్పటికీ చంద్రుడిపై పదులు, వందల సంఖ్యలో గుహలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
