ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (18:33 IST)

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్

Ramachandrudu team with  Hanu Raghavapudi
Ramachandrudu team with Hanu Raghavapudi
కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా నుంచి నాన్న సాంగ్ ని లాంచ్ చేశారు. కంపోజర్  శశాంక్ తిరుపతి ఈ పాటని హార్ట్ టచ్చింగ్ బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. చిలుకూరి ఆకాష్ రెడ్డి లిరిక్స్ ఆకట్టుకునేలా వున్నాయి. అంజనా బాలకృష్ణన్, శ్రాగ్వి ప్లజంట్ వోకల్స్ ఫీల్ గుడ్ వైబ్ ని క్రియేట్ చేశాయి.  
 
ఈ మూవీలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.  
 
ప్రేమ్ సాగర్ కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి జే సి శ్రీకర్ ఎడిటర్.
 
నటీనటులు : కృష్ణ వంశీ, మోక్ష,  బ్రహ్మాజీ,  సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి,  దివ్య శ్రీ గురుగుబెల్లి,  స్నేహమాధురి శర్మ తదతరులు