సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (16:56 IST)

నా కెరీర్ లో చేతి అచ్చు లాంటి సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు : సుహాస్

ambajipet team with maruti and others
ambajipet team with maruti and others
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో రిలీజ్  చేశారు. ఈ కార్యక్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్, భరత్ కమ్మ నిర్మాత ఎస్కేఎన్, ఛాయ్ బిస్కట్ శరత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి మా ప్రొడ్యూసర్స్ కారణం. నా డైరెక్టర్స్ నా కెరీర్ ను ఒక్కో ఇటుక పేర్చి ఇళ్లులా తీర్చిదిద్దారు. మా ఊరిలో గృహప్రవేశం టైమ్ లో కుంకుమ నీళ్లలో అరచేతిని అద్ది కొత్త ఇంటికి గోడకు అచ్చు వేస్తారు. ఆ అచ్చు అలాగే చిరకాలం ఉండిపోతుంది. నా కెరీర్ లో అలాంటి అచ్చు లాంటి సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". అన్నారు.
 
డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ,  నాకు మా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, ధీరజ్, వెంకటేష్ మహా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మంచి సినిమా చేద్దామని ఎంకరేజ్ చేశారు. సుహాస్ నాకు మంచి ఫ్రెండ్. 2017లో మేమిద్దరం కలిసి ఒక షార్ట్ ఫిలిం చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. ఆ తర్వాత సుహాస్ హీరోగా నటించిన రెండు సినిమాలకు  నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ టైమ్ లో మేము కొన్ని కథలు అనుకున్నాం. ఖచ్చితంగా కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. నేను ఈ కథను ఫోన్ లో లైన్ గా చెప్పాను. టైటిల్, స్టోరీ లైన్ విని మనం సినిమా చేద్దాం అన్నారు సుహాస్. నాతో మూవీ చేసినందుకు సుహాస్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.