సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (14:23 IST)

సోహెల్ చేసిన మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ ఎలా ఉందంటే ! రివ్యూ

Sohel, Roopa Koduvayur
Sohel, Roopa Koduvayur
నటీనటులు: సోహెల్, రూప కొడువయూర్, సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర తదితరులు
 
సాంకేతికత: దర్శకుడు : శ్రీనివాస్ వింజనంపాటి, నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, శుక్రవారం, ఆగస్టు 18, 2023
 
బిగ్ బాస్ నుంచి హీరో గా ఎదిగిన సోహైల్‌ చిన్న సినిమాలు చేసాడు. కానీ అంతగా పేరు రాలేదు. సరైన హిట్ కోసం చూస్తున్నాడు. అందుకే ఎవ్వరు టచ్ చేయని  `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` చేసాడు.  శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడువయుర్‌ హీరోయిన్‌గా నటించింది. మైక్‌ మూవీస్‌ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందొ  చూద్దాం.
 
 
కథ :
 
గౌతమ్ (సోహెల్)కు చిన్నతనంలోనే  అమ్మ, నాన్న చనిపోతారు. అనాథలా పెరిగి టాటూ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకుంటాడు. అతన్ని మహి (రూపా కొడువయూర్) పిచ్చిగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ ఆమెను దూరం పెడతాడు. అలా చేయడాని ఓ కారణం ఉంటుంది. ఇక మరోవైపు  టాటూ కాంపిటీషన్స్‌లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న గౌతమ్‌ ను చూసి ఓర్వలేని ఒకడు పగ పెంచుకుంటాడు. అనంతరం కొన్ని నాటకీయ పరిణామాలతో పెద్దవారిని ఎదిరించి మహి, గౌతమ్ తో వచ్చేస్తుంది. పిల్లలు వద్దనుకున్న గౌతమ్ కు మహి చేసిన చిన్న పొరపాటుతో గర్భం దాలుస్తుంది. ఫైనల్గా దాన్ని గౌతమ్  గర్భం గా మార్చుకునెలా  సీనియర్ డాక్టర్ సుహాసిని మణిరత్నం చేస్తుంది. ఇలా ఎందుకు చేసాడు. ఆతర్వాత కథ ఏమిటి అనేదే సినిమా. 
 
సమీక్ష:
 
మగవాళ్లు ప్రెగ్నెంట్‌ అనే పాయింట్ అమెరికా,  ఆస్ట్రేలియా లో జరిగిన ఓ ఉదంతాన్ని గౌతమ్ బేస్ చేసుకుని తాను ప్రెగ్నెంట్ గా వచ్చే బాధలు అనుభవిస్తాడు. ఇందుకు చిన్నతనంలో, ఆతర్వాత జరిగిన ఓ సంఘటన మైండ్ లో బాగా నాటుకుపోతుంది. ఇందులో భార్య పై ప్రేమ అనంతం అని చూపాడు. ఇంతకంటే ఏ మగాడు చేయని పని చేస్తాడు. ఇది ఇద్దరి మధ్యే ఉంటె కథ నడవదు. అందుకే ప్రపంచానికి తెలిసేలా జరుగుతుంది. అదే ఎలా అనేదే సెకండ్ హాఫ్ బాగా తీశాడు. 
 
మొదటి భాగం సరదాగా సాగుతుంది. ఆ తరువాత కథలో ట్విస్ట్ కనిపిస్తుంది. ఆడవారి ప్రసవ బాధలు, నొప్పులు, బాడీలో మార్పులు అనేవి గౌతమ్ అనుభవించేవి చిత్రంగా ఉన్నా రొటీన్ సినిమాలు భిన్నంగా ట్రై చేయడం అభినందనీయం. ఇందుకు దర్శక, నిర్మాతలను అభినందించాలి.  క్లైమాక్స్ లో గౌతమ్ లోకానికి తెలిపే విధానం డవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. అప్పటి వరకు చిత్రంగా చూసే ప్రజలు ఆయన గొప్పతనాన్ని సెల్యూట్ చేస్తారు. 
 
ఈ పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్, యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూప కొడువయూర్ నటన గొప్పగా లేకపోయినా ఓకే అనిపించేలా ఉంది. డాక్టర్ గా సుహాసిని మణిరత్నం పాత్ర బాగుంది.  వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర ఎంటర్టైన్ చేస్తారు. ముఖ్యంగా  బ్రహ్మాజీ తో వచ్చిన గే ఎపిసోడ్ కథకు హైలెట్. సన్నివేశపరంగా బాగా రాశారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి బాగానే తీసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 
మగ ప్రెగ్నెట్ అనేది వినడానికే చిత్రంగా ఉన్న కొన్ని సన్నివేశాలు రొటీనేగా ఉన్నాయి. హీరోయిన్ ఎందుకు పిచ్చిగా ప్రేమిస్తుందో బలమైన కారణం లేదు. ప్రధానంగా కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ గా మారడానికి సంబంధించిన సీన్స్ ఇంకా బలంగా చూపించాల్సింది.
 
ఏదిఏమైనా కొత్త ప్రయోగానికి హీరో శ్రీకారం చుట్టాడు. నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. వైవిధమైన పాయింట్ తో తీసిన నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి లను అభినందించాలి. కమషియల్ గా ఎంత సక్సెస్ అనేకంటే అవార్డు కు అర్హమైన సినిమా.