మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (15:45 IST)

విజయ్ ఆంటోనీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లవ్ గురు రాబోతుంది

Vijay Antony, Mrinalini Ravi
Vijay Antony, Mrinalini Ravi
బిచ్చగాడు సినిమాతో ఇండియన్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేశారు కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ. ఆయన నటించిన బిచ్చగాడు 2 సినిమా ఇటీవలే రిలీజై తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. విజయ్ ఆంటోనీ తొలిసారి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రోమియో తెలుగులో లవ్ గురు పేరుతో తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో మృణాళినీ రవి హీరోయిన్ గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
లవ్ గురు సినిమాను తన బ్యానర్ గుడ్ డెవిల్ లో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా ద్వారా లవ్ గురు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు హీరో విజయ్ ఆంటోనీ. ఆయనను రొమాంటిక్ ఎంటర్ టైనర్  లో చూడాలనుకునే అభిమానుల కోరికను ఈ సినిమా తీర్చనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి జోడీ ఓ మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీని చూపించబోతున్న ఫీల్ ను కలిగిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి విడుదలకు ప్లాన్ చేసుకుంటోంది.
 నటీనటులు - విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు