బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (18:28 IST)

కామెడీ డ్రామా కథతో అంబాజీపేట మ్యారేజి బ్యాండు

Shivani Nagaram
Shivani Nagaram
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం హీరోయిన్ శివాని నాగరం బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో ఆమె నటిస్తున్న వరలక్ష్మి క్యారెక్టర్ లుక్ ను ఈ బర్త్ డే పోస్టర్ లో రివీల్ చేశారు.
 
వరలక్ష్మి లుక్ చూస్తుంటే ఆమె పాత్ర సినిమాలో పక్కింటి అమ్మాయి క్యారెక్టర్ లా ఉంటుందని తెలుస్తోంది. క్యాజువల్ డ్రెస్ లో ఆమె కాలేజ్ కు వెళ్తున్నట్లు పోస్టర్ లో చూపించారు. హీరో మల్లి లాగే వరలక్ష్మి క్యారెక్టర్ కూడా నేచురల్ ఫీలింగ్ కలిగిస్తోంది. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్  కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా టీజర్ ను త్వరలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.