1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Crocodile Show Ends with Unexpected Feeding

మొసలినోట్లో చేయిపెట్టిన ట్రైనర్.. అదేం చేసిందో తెలుసా? (వీడియో)

థాయ్‌లాండ్‌లో మొసలి నోట్లో చేయిపెట్టిన ఓ ట్రైనర్‌కు చుక్కలు కనిపించాయ్. మొసలి నోటిలో చేయి పెట్టి ఏదో చేస్తూ వుండిన ట్రైనర్‌ చేతిని మొసలి కొరికిపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడి

Crocodile
థాయ్‌లాండ్‌లో మొసలి నోట్లో చేయిపెట్టిన ఓ ట్రైనర్‌కు చుక్కలు కనిపించాయ్. మొసలి నోటిలో చేయి పెట్టి ఏదో చేస్తూ వుండిన ట్రైనర్‌ చేతిని మొసలి కొరికిపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌లోని కావ్ యాంగ్ అనే నేషనల్ పార్కుకు అత్యధిక సంఖ్యలో వీక్షకులు వస్తుంటారు. 
 
స్వదేశంలోనే కాకుండా విదేశాల నుంచి ఈ పార్కును సందర్శించేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ పార్కులోని మొసలి చెంత ఓ ట్రైనర్ ఏదో షో చేస్తూ కనిపించాడు. మొసలి నోటిలో చేతిని పెట్టి ఏదో చేస్తుండగా.. ఆ మొసలికి చిర్రెత్తుకొచ్చింది. అంతే చేతిని కొరికి పెట్టింది. దీంతో అక్కడి నుంచి ట్రైనర్ పారిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 
About Writer
Selvi
తర్వాతి కథనం
అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టు, కడుపు చెయ్ అన్నోళ్ళను చూపించరా... రోజా ఫైర్