శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (11:19 IST)

థాయ్‌లాండ్ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు

థాయ్‌‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగం సెమీఫైనల్లో సింధు 21-23, 16-21, 21-9 తేడాతో గ్రెగరియా మరిస్కాపై విజయ

థాయ్‌‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగం సెమీఫైనల్లో సింధు 21-23, 16-21, 21-9 తేడాతో గ్రెగరియా మరిస్కాపై విజయం సాధించింది. 29వ ర్యాంకర్‌ గ్రెగరియా సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.
 
ఆకరులో అనవసర తప్పిదాలతో గ్రెగరియా పాయింట్లు సమర్పించుకోవడంతో గేమ్‌ సింధు సొంతమైంది. రెండో గేమ్‌ సింధు దూకుడుగా ప్రారంభించింది. అయితే ఆ తర్వాత గ్రెగారియా పుంజుకుని 21-16తో గేమ్‌‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌‌లో సింధు చెలరేగి ఆడింది. మొదటి నుంచి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం సాధించింది. సింధు ధాటికి గ్రెగరియా చేతులెత్తేసింది. దీంతో సింధు 21-9తో గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ను సొంతం చేసుకుంది. 
 
కాగా, ఆదివారం జరిగే ఫైనల్ పోటీల్లో సింధు.. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహారాతో తలపడనుంది. వీరిద్దరూ ఇప్పటి వరకు 10సార్లు తలపడగా చెరో ఐదుసార్లు గెలిచారు. చివరిసారిగా వీరిద్దరూ ఈ యేడాది మార్చిలో జరిగిన ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌‌లో తలపడగా, ఈ మ్యాచ్‌లో సింధు పైచేయిగా నిలిచింది.