శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జులై 2018 (10:44 IST)

ఫిఫా వరల్డ్ కప్ : 28 యేళ్ల తర్వాత సెమీఫైనల్స్‌కు ఇంగ్లండ్

రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ సాకర్ పోటీల్లో భాగంగా, ఇంగ్లండ్ జట్టు 28 యేళ్ల తర్వాత సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టింది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్స్‌లో భాగంగా జరిగిన పోరులో స్వీడన్‌పై అనూహ్యరీతిలో చ

రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ సాకర్ పోటీల్లో భాగంగా, ఇంగ్లండ్ జట్టు 28 యేళ్ల తర్వాత సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టింది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్స్‌లో భాగంగా జరిగిన పోరులో స్వీడన్‌పై అనూహ్యరీతిలో చెలరేగింది. లయన్స్ ఆటగాళ్లు తెలివిగా ఆడటంతో ఇంగ్లీష్ జట్టు 2-0తో స్వీడన్‌పై ఘన విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. 1990 తరువాత సెమీఫైనల్లో అడుగుపెట్టడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.
 
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగింది. అయితే, ఇంగ్లండ్ మాత్రం చాలా సంయమనంతో తెలివైన ఆటను ప్రదర్శించింది. ఎలాంటి ఆందోళన చెందకుండా ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. ఈ క్రమంలోనే 30వ నిమిషయంలో ఇంగ్లండ్ డిఫెండర్ హ్యారీ గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలో నిలిపాడు. 
 
ప్రథమార్ధం ముగిసేలోగా గోల్ కొట్టి స్కోరు సమం చేయాలని స్వీడన్ పట్టుదలగా ఆడింది. అయినా ఫలితం లేకపోయింది. ఇక రెండో సెషన్ ఆరంభమైన స్వల్పవ్యవధిలోనే 59వ నిమిషంలో డిలే అల్లీ గోల్ చేసి ఇంగ్లాండ్‌ను 2-0తో పటిష్టస్థితిలో నిలిపాడు. ఇంగ్లండ్ జట్టు సేఫ్‌జోన్‌లో ఉండటంతో సమయాన్ని వృధా చేసేందుకు ప్రయత్నించింది. ఆఖరి వరకు మరో గోల్ నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్ విజయంతో సెమీస్ చేరగా.. స్వీడన్ నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.