శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జులై 2018 (10:50 IST)

ట్వంటీ20 మ్యాచ్: భారత్‌పై ఓడినా.. ఇంగ్లీష్ క్రికెటర్ల సంబరాలు

మాంచెస్టర్‌లో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి ట్వంటీ20 మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. బంతితో కుల్‌దీప్‌ యాదవ్‌, బ్యాట్‌తో కేఎల్‌ రాహుల్‌ రెచ్చిపోవడంతో

మాంచెస్టర్‌లో  వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి ట్వంటీ20 మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. బంతితో కుల్‌దీప్‌ యాదవ్‌, బ్యాట్‌తో కేఎల్‌ రాహుల్‌ రెచ్చిపోవడంతో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. కానీ, ఇంగ్లీష్ క్రికెటర్లు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
 
భారత్‌తో జరిగిన తొలి టీ20మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో ఓడినా.. ఇంగ్లాండ్‌ క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోయారు. కారణం రష్యా వేదికగా ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఇందులో చివరి మ్యాచ్‌లో కొలంబియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోయారు. 
 
ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశలో ఇంగ్లాండ్‌, కొలంబియా మధ్య చివరి మ్యాచ్‌ జరిగింది. దీనిలో భాగంగా నిర్ణీత సమయంలోపు ఇరు జట్లు చెరో గోల్‌ చేసి 1-1తో స్కోరు సమంగా ఉండటంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారీ తీసింది. అయితే అదనపు సమయంలోనూ పోరు హోరాహోరీగా సాగడంతో ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌పై ఆధారపడక తప్పలేదు. కాగా పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో ఇంగ్లాండ్‌ విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. 
 
ఇదిలావుండగా, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కంటే ముందే మాంచెస్టర్‌లో ఇంగ్లండ్-భారత్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయింది. తమ ఫుట్‌బాల్‌ జట్టు నాకౌట్‌లో గెలవడంతో ఇంగ్లండ్ క్రికెటర్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది. 
 
మళ్లీ ఫిఫా ప్రపంచకప్‌ మన ఇంటికి రాబోతుంది అంటూ తెగ మురిసిపోతూ కామెంట్‌ కూడా రాసుకొచ్చింది. 1966ప్రపంచకప్‌ ఫైనల్లో పశ్చిమ జర్మనీని ఓడించి ఇంగ్లండ్‌ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి ఇంగ్లండ్‌ నుంచి ఆ స్థాయిలో ప్రదర్శన రాలేదు. అయితే చివరగా 2006 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ క్వార్టర్స్‌కు చేరినా.. పోర్చుగల్‌ చేతిలో ఓడింది. ఆ తర్వాతి నుంచి మళ్లీ ఇంగ్లండ్‌ క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి.