1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. donald trump comments on india china gdp

భారత్, చైనాలు దూసుకెళ్తున్నాయి... అమెరికా అగ్రదేశ హోదాకు ముప్పు : డోనాల్డ్ ట్రంప్

భారత్, చైనాలు దూసుకెళ్తున్నాయనీ, ఫలితంగా అమెరికా అగ్రదేశ హోదాకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అన్నారు. జీడీపీలో భారత్ 8 శాతం వృద్ధి నమోదు చేస్తూ అభ

donald trump
భారత్, చైనాలు దూసుకెళ్తున్నాయనీ, ఫలితంగా అమెరికా అగ్రదేశ హోదాకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అన్నారు. జీడీపీలో భారత్ 8 శాతం వృద్ధి నమోదు చేస్తూ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, అదేసమయంలో అమెరికా మాత్రం కేవలం 1 శాతం లేదా అంతకంటే తక్కువ శాతం జీడీపీ వృద్ధిరేటుతో వెనకబడిపోయిందని ట్రంప్ గుర్తు చేశారు. 
 
లాస్ వెగాస్‌లో జరిగిన ఫైనల్ చర్చావేదికలో మాట్లాడుతూ... భారత్ బాటలోనే చైనా 6 శాతం జీడీపీ వృద్ధితో దూసుకుపోతోందని అన్నారు. ఇలాగే అమెరికా విధానాలు కొనసాగితే దేశం ప్రమాదంలో పడుతుందని అన్నారు. ఇలాంటి విధానాలు సరికాదని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా జీడీపీ కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన అన్నారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
నోబెల్ శాంతి బహుమతిని నాకు ఎందుకిచ్చారో నాకే తెలియదు : బరాక్ ఒబామా