శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (10:29 IST)

నోబెల్ శాంతి బహుమతిని నాకు ఎందుకిచ్చారో నాకే తెలియదు : బరాక్ ఒబామా

నోబెల్ శాంతి బహుమతిని తనకు ఎందుకిచ్చారో ఇప్పటికీ తెలీదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (55) సంచలన వాఖ్యలు చేశారు. ఒబామా 2008లో అధ్యక్షుడయ్యాక 2009లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. వచ్చే ఏడాది పదవీ కాల

నోబెల్ శాంతి బహుమతిని తనకు ఎందుకిచ్చారో ఇప్పటికీ తెలీదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (55) సంచలన వాఖ్యలు చేశారు. ఒబామా 2008లో అధ్యక్షుడయ్యాక 2009లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. వచ్చే ఏడాది పదవీ కాలం పూర్తి కావడంతో శ్వేతసౌథాన్ని ఆయన వీడనున్న నేపథ్యంలో ''ద లేట్ షో'' అనే టీవీ షోలో ఆయన పాల్గొన్నారు. 
 
ఉద్యోగానికి వచ్చిన ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసే రీతిలో ఈ కార్యక్రమం సాగింది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థిలా ఒబామా నటించగా, ఇంటర్వ్యూ చేసే వ్యక్తిగా వ్యాఖ్యాత  పలు ప్రశ్నలు అడిగారు. ఇక్కడే నోబెల్ గురించి ప్రస్తావించగా ఒబామాపై వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూయర్ ఒబమాను మీకు నోబెల్ శాంతి పురస్కారం ఎందుకిచ్చారు? అని అడుగగా... వీటికి ఒబామా ఆసక్తికర సమాధానాలిచ్చారు. దానికి సమాధానం తనకు తెలియదని ఒబామా పేర్కొన్నారు.