1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Donald Trump's communications chief Hope Hicks 'resigning'

ట్రంప్ కోసం ప్రతి రోజూ అబద్ధాలు చెప్పలేక పోతున్నా : హోప్ హిక్స్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మిస్ హోప్ హిక్స్ తేరుకోలేని షాకిచ్చారు. ఆమెను ఏరికోరి వైట్‌హౌస్‌లో కీలక పదవిలో నియమించుకుంటే ఆమె తన పదవికి రాజీనామా చేసి వెళ్లి

Donald Trump
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మిస్ హోప్ హిక్స్ తేరుకోలేని షాకిచ్చారు. ఆమెను ఏరికోరి వైట్‌హౌస్‌లో కీలక పదవిలో నియమించుకుంటే ఆమె తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయింది. హిక్స్ ఎందుకు రాజీనామా చేసిందో పరిశీలిస్తే, 
 
వైట్‌హౌస్ నుంచి నిత్యమూ పత్రికా ప్రకటనల విడుదల, మీడియా సమావేశాల నిర్వహణ, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చే వార్తల సమీకరణ వంటి కీలకమైన బాధ్యతలను కమ్యూనికేషన్స్ విభాగం చూస్తుంది. ఈ విభాగ అధిపతిగా హోప్ హిక్స్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏరికోరి నియమించుకున్నారు. 
 
నిజానికి ఈమె ట్రంప్ సహాయకురాలిగా ఎక్కువ కాలం ఉండేది. పైగా, ఈమె ఓ మాజీ మోడల్. వయసు 29 ఏళ్లు. ఈమెను శ్వేతసౌధంలోని కమ్యూనికేషన్స్ విభాగ అధిపతిగా నియమించారు. నిజానికి గడచిన కాలంలో ఈ విభాగంలో డైరెక్టర్లుగా పని చేసిన నలుగురు తన పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. 
 
ఇపుడు హోప్ హిక్స్ వంతు వచ్చింది. రాజీనామాకు ముందు హోప్ హిక్స్ తన సన్నిహితులతో మాట్లాడుతూ, ట్రంప్ కోసం రోజూ శుద్ధ అబద్ధాలు ఆడలేక పోతున్నానని, అందువల్లే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దొంగలతో పోల్చుతారా? కేటీఆర్‌‌పై మండిపడిన జానారెడ్డి