1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Indians Must Leave Iran Immediately: Indian Government Warning

ఇరాన్ నుంచి భారతీయులు తక్షణమే వీడండి: భారత ప్రభుత్వం హెచ్చరిక

Indian Government advisery statement
కాల్పుల విరమణను పొడగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం బుధవారం నాడు మరో హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ దేశంలో వుంటున్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలంటూ పేర్కొన్నది. సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేసి వచ్చేయాలంటూ కేంద్ర విదేశాంగ శాఖ ఇరాన్ లోని రాయబార కార్యాలయం ద్వారా స్పష్టం చేసింది. కానీ ఇరాన్ దేశంలోని ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారా రావాలనీ, సొంత మార్గాల ద్వారా వచ్చేయలనే ప్రయత్నం చేయవద్దని తెలిపింది. కాగా ఇప్పటికే ఇరాన్ నుండి 2,300 మందికి పైగా భారతీయులను సురక్షితంగా తరలించారు.
 
ఇరాన్ మలమల మాడుతోంది, జీతాలు ఇవ్వలేకపోతున్నారు
ఇరాన్ దేశంపై కాల్పుల విరమణ సమయాన్ని మరికాస్త పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ ద్వారా తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ... ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వాళ్లంతా కూర్చుని ఆలోచన చేసి సమగ్రమైన శాంతి ప్రతిపాదనతో వస్తారని ఆశిస్తున్నాను. కానీ ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం సాగుతూనే వుంటుంది. ఆ దేశం ఆర్థికంగా కుప్పకూలుతోంది. పోలీసులకు, సైన్యానికి జీతాలు ఇవ్వలేక ఇరాన్ చస్తోంది. అదంతా చూస్తూనే వున్నా. మరికొన్ని రోజులు వేచి చూస్తా. వాళ్లు మారతారని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నారు.
 
ట్రంప్ స్పందనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. మమ్మల్ని ఆకలికి అలమటించేట్లు చేసి కాల్పుల విరమణ అంటారా, తమ దేశానికి ఏవీ అందకుండా చేయడం ద్వారా మీరు చేస్తున్నదేమిటి. ఇది యుద్ధం కంటే తీవ్రమైనది. దీనికి సైనిక చర్యతోనే సమాధానిస్తాము.
 
ట్రంప్ కాల్పుల విరమణ అంతా ఓ బూటకం. కేవలం తమపై మూకుమ్మడి దాడి చేసేందుకే సమయం తీసుకుంటున్నారు. అంతేతప్ప ఈ పొడగింపు అంతా ఓ పెద్ద డ్రామా అంటూ కొట్టిపారేసింది. మరోవైపు ఇస్లామాబాదులో జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలకు బ్రేక్ పడింది. అటు ఇరాన్ చర్చలకు వచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మొత్తమ్మీద ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయోనన్న ఆందోళనలో ప్రపంచ దేశాలున్నాయి.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
తెలంగాణ నుండి 8 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించనున్న దక్షిణ రైల్వే