1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Kabul hotel attack: Intercontinental under attack by Terrorists

కాబూల్‌లో మారణహోమం... ఉగ్రదాడిలో 35 మంది మృతి!

అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మారణహోమం జరిగింది. ఉగ్రవాదులు జరిగిన దాడుల్లో 35 మందికి పైగా మృత్యువాతపడ్డారు. స్థానిక ఇంటర్‌ కాంటినెంటల్‌ లగ్జరీ హోటల్‌‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగింది.

Kabul hotel attack
అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మారణహోమం జరిగింది. ఉగ్రవాదులు జరిగిన దాడుల్లో 35 మందికి పైగా మృత్యువాతపడ్డారు. స్థానిక ఇంటర్‌ కాంటినెంటల్‌ లగ్జరీ హోటల్‌‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగింది. 
 
శనివారం రాత్రి 9 గంటలకు నలుగురు సాయుధులు హోటల్‌లోకి ప్రవేశించారు. అత్యాధునిక ఆయుధాలతోపాటు రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రనేడ్లతో దాడి చేశారు. ముంబై ముట్టడి తరహాలో దానిని తమ ఆధీనంలోకి తీసుకుని విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. కొంతమందిని చంపేశారు. పలువురిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్‌లోని కొన్ని ఫ్లోర్లకు నిప్పు పెట్టారు. 
 
బహుళ అంతస్తుల హోటల్లో ఉగ్రవాదులు స్వైర విహారం చేస్తున్నారు. కాల్పులకు నాలుగో ఫ్లోర్లో ఉన్న కిచెన్‌ తగలబడింది. దాంతో ఆ అంతస్తు మొత్తానికి నిప్పంటుకుంది. కాల్పుల్లో 15 మంది వరకూ చనిపోయి ఉంటారని సన్‌ పత్రిక పేర్కొంది. మృతుల సంఖ్య 35 దాకా ఉంటుందని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా ప్రతినిధి చెప్పారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పవన్ ట్వీట్ : కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా యాత్ర