మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (11:15 IST)

జమ్మూకాశ్మీర్‌లో జైషే మొహమ్మద్ చీఫ్ మేనల్లుడు తల్హా రషీద్ హతం

జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం మరో అడుగు ముందుకేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాదులను పూర్తిగా తుదిముట్టించాలనే లక్ష్యంతో కదులుతున్న భారత సైన్యం.. ఎన్‌కౌంటర్లో జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మేనల్లుడు, త

జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం మరో అడుగు ముందుకేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాదులను పూర్తిగా తుదిముట్టించాలనే లక్ష్యంతో కదులుతున్న భారత సైన్యం.. ఎన్‌కౌంటర్లో జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మేనల్లుడు, తల్హా రషీద్‌ను హతమార్చింది. పుల్వామా జిల్లాలో తలదాచుకున్న రషీద్‌ను జవాన్లు కాల్చి చంపారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాను వీరమరణం పొందగా, మరో ఇద్దరు పౌరులకూ గాయాలయ్యాయి. 
 
జేఈఎంకు స్థానిక కమాండర్‌గా విధులు నిర్వహిస్తూ, యువతను ఉగ్రవాదంవైపు ప్రోత్సహాస్తున్నాడన్న ఆరోపణలతో రషీద్‌పై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఇక రషీద్ మరో ఇద్దరు ఉగ్రవాదులు ముహమ్మద్ భాయ్, వసీమ్‌లతో కలిసి కాండీ అగ్లార్ గ్రామంలో ఉన్నారనే సమాచారం అందుకున్న జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ తరువాత, ఘటనా స్థలినుంచి ఓ ఏకే 47, ఒక ఎం 16 రైఫిల్, ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. రషీద్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్లో హతమైనట్లు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు.