సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ...
ఇండియన్ ఆర్మీ మరోమారు సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. ఈ దఫా మాత్రం పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల శిబిరాలపై కాదు. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది.
ఇండియన్ ఆర్మీ మరోమారు సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. ఈ దఫా మాత్రం పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల శిబిరాలపై కాదు. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన 70 మంది పారా కమాండోల బృందం బుధవారం ఉదయం 4.45 గంటలకు ఈ దాడి నిర్వహించింది.
ఈ దాడిలో లాంఖూ గ్రామ సమీపంలో ఉన్న నాగా తీవ్రవాదుల శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ మెరుపుదాడుల్లో ఎన్‌ఎస్‌సీఎన్-కే ఉగ్రమూకకు భారీ నష్టం వాటిల్లినట్టు సైన్యం ప్రకటించింది. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పింది. అయితే, సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన కమాండోలు అంతర్జాతీయ సరిహద్దు దాటలేదని స్పష్టంచేసింది.
ఎస్‌ఎస్ ఖప్లాంగ్ నేతృత్వంలో ఏర్పడిన ఎన్‌ఎస్‌సీఎన్-కే తిరుగుబాటుదళం.. నాగాల్యాండ్, మణిపూర్‌ల్లో మన జవాన్లపై వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఈ తరహా మెరుపుదాడులు నిర్వహించి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఇండో మయన్మార్ సరిహద్దుల్లో భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం గమనార్హం.