మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (11:02 IST)

ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు: ముగ్గురు మావోయిస్టుల హతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్ డివిజన్ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం అర్థరాత్రి పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యార

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్ డివిజన్ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం అర్థరాత్రి పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. టిబెట్ బార్డర్ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
 
కోండ్‌గావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కోపెన్ కడ్కా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు జిల్లా ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. మృతులను మహేశ్ (ఏరియా కమిటీ మెంబర్), రాకేశ్ (లోకల్ ఆర్గనైజింగ్ స్కాడ్ ఏసీఎం), రంజిత్ పల్లెమడి డిప్యూటీ కమాండర్‌లుగా గుర్తించారు.
 
మృతులు ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఒక ఏకే 47, ఒక ఇన్‌శ్రా రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్‌ను స్వాధీనం చేస్తున్నామన్నారు. చనిపోయిన వారంతా బస్తర్ ప్రాంతానికి చెందినవారని ఎస్పీ వెల్లడించారు.