మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

సోమాలియా రాజధాని రక్తసిక్తం ... మొగదిషులో మారణహోమం

ఆఫ్రికాదేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేశారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు ట్రక్కు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఏకంగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు

ఆఫ్రికాదేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేశారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు ట్రక్కు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఏకంగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
నిత్యం రద్దీగా ఉండే కె-5 కూడలిలోని సఫారీ బయట ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో దాడి చేశారు. శక్తిమంతమైన ఈ పేలుడుకు సమీపంలోని భవనాలు తునాతునకలయ్యాయి. ప్రజల శరీరాలు ఛిద్రమై ఎగిరిపడ్డాయి. మృతదేహాలు కాలి గుర్తుపట్ట లేనంతగా మారిపోయాయి. రక్తమోడుతున్న శరీరాలతో ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. 
 
ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 300కి చేరుకుంది. పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అల్-షబాబ్' ఈ దాడికి పాల్పడినట్టు ప్రభుత్వ అనుమానిస్తోంది.