శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: ఆదివారం, 15 అక్టోబరు 2017 (20:22 IST)

నా తండ్రిని చంపితే 5 లక్షలు.. ఆ తరువాత ఏమైందంటే...

మానవత్వం మంట గలుస్తోంది. డబ్బుల కోసం ఎంతకైనా తెగబడుతున్నారు కొందరు. అలాంటి సంఘటనే తిరుపతిలో జరిగింది. ఈ నెల 9వ తేదీన తిరుపతిలోని పెద్దకాపు వీధిలో వాకింగ్‌కు ఇంటి నుంచి బయటకు వచ్చిన సత్యనారాయణ అనే వ్యక్తిని దారుణంగా నడిరోడ్డుపై నరికి చంపారు గుర్తుతెలి

మానవత్వం మంట గలుస్తోంది. డబ్బుల కోసం ఎంతకైనా తెగబడుతున్నారు కొందరు. అలాంటి సంఘటనే తిరుపతిలో జరిగింది. ఈ నెల 9వ తేదీన తిరుపతిలోని పెద్దకాపు వీధిలో వాకింగ్‌కు ఇంటి నుంచి బయటకు వచ్చిన సత్యనారాయణ అనే వ్యక్తిని దారుణంగా నడిరోడ్డుపై నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ ప్రారంభించారు.
 
పోలీసుల విచారణలో ఆసక్తికర  విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న కొడుకే ఆస్తి కోసం తండ్రిని దారుణంగా హత్య చేయించాడు. సత్యనారాయణ తిరుపతి కోనేటి సమీపంలో ఒక ప్రైవేటు లాడ్జిని నడుపుతున్నాడు. సత్యనారాయణ పెద్ద కొడుకు చందు గత సంవత్సరంగా ఆస్తిని పంచి ఇవ్వాలని తాను బిజినెస్ చేసుకోవాలని కోరాడు. అంతకుముందే చందు 20 లక్షల రూపాయలు అప్పుచేసి మరీ బిజినెస్ పెట్టి నష్టపోయాడు. కుమారుడిని నమ్మని తండ్రి ఆస్తి పంచేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో కన్నతండ్రిపై కోపం పెట్టుకున్న చందు తండ్రిని చంపేస్తే ఆస్తి వస్తుందని భావించాడు.
 
ముందు కొంత డబ్బులను సుపారీ కోసం బేరం పెట్టాడు. తనకు తెలిసిన వారందరినీ తన తండ్రిని చంపితే 5 లక్షలని చెబుతూ వచ్చాడు. అయితే ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో తన స్నేహితులు ముగ్గురితో కలిసి వారికి 5 లక్షల సుపారి ఇచ్చి తాను కలిసి కన్న తండ్రిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపాడు. చివరకు నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కన్న కొడుకే తండ్రిని చంపడం తీవ్ర సంచలనం రేపుతోంది.