శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (14:48 IST)

పడక గదిలో ప్రియుడితో అసభ్య భంగిమలో భార్య.. చూసిన భర్త ఏమయ్యాడు

తాను ఓ యువకుడితో గుట్టుగా సాగిస్తున్న వివాహేతర సంబంధం బహిర్గతం కావడంతో ఏకంగా కట్టుకున్న భర్తనే మట్టుబెట్టిందీ ఓ భార్య. తన ప్రియుడితో కలిసి పడక గదిలో అసభ్య భంగిమలో ఉన్న సమయంలో భర్త చూశాడు.

తాను ఓ యువకుడితో గుట్టుగా సాగిస్తున్న వివాహేతర సంబంధం బహిర్గతం కావడంతో ఏకంగా కట్టుకున్న భర్తనే మట్టుబెట్టిందీ ఓ భార్య. తన ప్రియుడితో కలిసి పడక గదిలో అసభ్య భంగిమలో ఉన్న సమయంలో భర్త చూశాడు. దాంతో భార్య తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఆగ్రా సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ఆగ్రాకు సమీపంలోని గాలిబ్ గ్రామానికి చెందిన సురాజ్ పాల్ (50), గుడ్డీ దేవి (26) అనే దంపతులు ఉన్నారు. అయితే, గుడ్డి దేవికి అదే ప్రాంతానికి చెందిన సత్యేందర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించిన గుడ్డీదేవి.. తమ పడక గదిలో చూడకూడని విధంగా ఉన్నారు. 
 
ఆసమయంలో ఇంటికి వచ్చిన సురాజ్ పాల్.. పడక గదిలో సత్యేందర్‌తో తన భార్య గుడ్డీదేవి ఉండటాన్ని చూసి విస్తుపోయాడు. అయినప్పటీ భార్యను మందలించి వదిలివేశాడు. అయితే, తమకు అడ్డుగా ఉన్నాడనీ భావించిన గుడ్డీ దేవి తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఇందులోభాగంగా భర్తను గాలిబ్ గ్రామంలోని పొలానికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ మాటువేసివున్న సత్యేందర్‌తో కలిసి గుడ్డీదేవి భర్తను హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులైన గుడ్డి దేవి, సత్యేందర్‌లను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.