గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (13:41 IST)

రౌడీ షీటర్ హత్య కేసు : లొంగిపోయిన డీఎస్పీ

రౌడీ షీటర్ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు లొంగిపోయారు. రౌడీ షీటర్ గేదెల రాజు ఇటీవల విశాఖలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిదే. ఈ కేసుతో డీఎస్పీ రవిబాబుకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

రౌడీ షీటర్ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు లొంగిపోయారు. రౌడీ షీటర్ గేదెల రాజు ఇటీవల విశాఖలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిదే. ఈ కేసుతో డీఎస్పీ రవిబాబుకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన గత రెండు వారాలుగా అజ్ఞాతంలోవున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఎట్టకేలకు చోడవరం పీఎస్‌లో లొంగిపోయారు. 
 
ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. అయితే రవిబాబుకు కేసుతో సంబంధం లేకపోతే ఇన్నిరోజులు అజ్ఞాతంలో ఎందుకు ఉన్నారు?... ఈకేసులో ఏ-2గా ఉన్న భూపతిరాజు పరారీలో ఎందుకు ఉన్నారనే అంశాలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.