గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (11:00 IST)

ప్రేమ కోసం గ్రీన్ కార్డును తిరిగిచ్చేశా... వింతగా చూశారు.. : సత్య నాదెళ్ల

తనకు వివాహమైన కొత్తల్లో భార్య అనుపమ కోసం గ్రీన్ కార్డును వదిలేసుకుని హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసిన వేళ, ప్రతి ఒక్కరూ తనను వింతగా చూశారని, అంత అవకాశాన్ని ఎందుకు వదులుకున్నావన్న ప్రశ్న ఎంతో మంది నుంచి

తనకు వివాహమైన కొత్తల్లో భార్య అనుపమ కోసం గ్రీన్ కార్డును వదిలేసుకుని హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసిన వేళ, ప్రతి ఒక్కరూ తనను వింతగా చూశారని, అంత అవకాశాన్ని ఎందుకు వదులుకున్నావన్న ప్రశ్న ఎంతో మంది నుంచి ఎదురైందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. ఈ విషయాన్ని తాను రాసిన సరికొత్త పుస్తకం 'హీట్ రిఫ్రెష్'లో పేర్కొన్నారు. 
 
ఈ బుక్ రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రీన్ కార్డులు ఉన్నవారికి, యూఎస్ నిబంధనల కారణంగా భార్యను తీసుకురాలేని పరిస్థితి ఉంటుందని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను సియాటెల్‌లో ఉండేవాడినని, భార్యను తీసుకురావడం కుదరకపోవడంతో, గ్రీన్ కార్డును వదిలేసుకున్నట్టు చెప్పారు. 
 
1994లో ఇది జరిగిందని, ఢిల్లీలోని యూఎస్ ఎంబసీకి వెళ్లి గ్రీన్ కార్డు రిటర్న్ చేసి, హెచ్-1బీకి దరఖాస్తు చేస్తే, అక్కడి ఉద్యోగి చాలా వింతగా చూసి కారణాన్ని అడిగాడని, అప్పుడు అమెరికా వలస విధానం గురించి తాను వివరించగా, నిజమేనన్నట్టు చూసి దరఖాస్తు ఇచ్చాడని, ఆ వెంటనే తనకు హెచ్-1బీ కూడా వచ్చిందని, సియాటెల్ వెళ్లి యూఎస్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించానని చెప్పుకొచ్చారు.