శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (15:05 IST)

'మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను' అంటున్న రేణూ దేశాయ్

హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి ప్రేమలోపడ్డారు. అయితే, ఈ దఫా మరో వ్యక్తి ప్రేమలో కాదండోయ్. ఓ ప్రేమ జంట చేసిన డ్యాన్స్ చూసిన ఆమె వారిద్దరిపై ప్రేమలో పడిపోయారు. ఈ వివరాలను ప

హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి ప్రేమలోపడ్డారు. అయితే, ఈ దఫా మరో వ్యక్తి ప్రేమలో కాదండోయ్. ఓ ప్రేమ జంట చేసిన డ్యాన్స్ చూసిన ఆమె వారిద్దరిపై ప్రేమలో పడిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
‘నీతోనే డ్యాన్స్ షో’ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ఇందులో రేణూ దేశాయ్ జ‌డ్జిగా పాల్గొంటున్న విషయంతెల్సిందే. ఈ డ్యాన్స్‌షోలో ఆమె ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ షో రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారమవుతోంది. 
 
ఈ షోకి సంబంధించిన ప్రొమోను స్టార్ మా త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఉంచింది. ఓ జంట చేసిన డ్యాన్స్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన రేణూ దేశాయ్‌.. ఆ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు అందరితో క‌న్నీరు పెట్టిస్తున్నాయి.
 
నిజానికి 'నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను.. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటానో అప్పుడు మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా పిలుస్తా' అని ఆమె క‌న్నీరు పెట్టుకుంటూ ఆ జంట‌కు చెప్పింది.