సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (14:27 IST)

తండ్రే కూతురుని చంపేశాడా? ప్రేమించినోడి కోసమా? ఆస్తి కోసమా?

ఆంధ్రప్రదేశ్ రామచంద్రాపురంలో 20 ఏళ్ల యువతి నందుల జయదీపక హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ హత్యను గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్లు పోలీసులు నిర్థారించినప్పటికీ ఆ తర్వాత ఈ హత్యను తన కన్నతండ్రే చేయించి వుంటాడన్న అనుమానాలను పోలీసులు వ్యక్

ఆంధ్రప్రదేశ్ రామచంద్రాపురంలో 20 ఏళ్ల యువతి నందుల జయదీపక హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ హత్యను గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్లు పోలీసులు నిర్థారించినప్పటికీ ఆ తర్వాత ఈ హత్యను తన కన్నతండ్రే చేయించి వుంటాడన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... మంగళవారం నాడు అర్థరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో జయ దీపిక తండ్రి, సోదరుడు వచ్చేసరికి ఆమె నెత్తురు మడుగులో పడి వుంది. ఆమె తల, మెడ, చేతులపై తీవ్ర గాయాలున్నాయి. దీనితో హుటాహుటిన ఆమెను ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత హత్యా స్థలంలో ఆధారాలను సేకరించారు. 
 
ఇదిలావుండగా కూనపరెడ్డి మణికంఠ అనే యువకుడితో దీపిక చాలా సన్నిహితంగా వుండటమే కాకుండా అతడితో ఎఫైర్ పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారాన్ని తండ్రి, సోదరుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఐనప్పటికీ దీపిక వారి మాటలు లెక్కచేయలేదు. 
 
ఈ నేపధ్యంలో కొందరు కిరాయి హంతకులతో ఈ దారుణానికి పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు. ఆమె హత్య వెనుక కేవలం ఎఫైర్ ఒక్కటే కారణం కాదనీ, దీపిక పేరుపై రూ. 2 కోట్లు విలువ చేసే ఆస్తి కూడా వుండటం కూడా మరో కారణం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కేసు దర్యాప్తు సాగుతోంది. మరిన్ని విషయాలు వెలుగుచూడనున్నాయి.