మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (11:33 IST)

స్విమ్మింగ్ పూల్‌లో శృంగారంలో మునిగి తేలిన కొత్త జంట.. చివరికి షాక్

స్విమ్మింగ్ పూల్‌లో ఆ కొత్త జంట శృంగారంలో మునిగి తేలింది. అయితే చివరికి ఆ జంటకు షాక్ తప్పలేదు. వివారాల్లోకి వెళితే ఇటలీకి చెందిన నటాలియా దంపతులు కొత్తగా వివాహం చేసుకొని హనీమూన్ కోసం కెన్యా వెళ్లారు. అక్కడే ప్యాకేజీ టూరులో భాగంగా స్థానిక వైల్డ్ థీమ్ రిసార్టులో బస చేశారు. అక్కడ ఓ సొగసైన స్విమ్మింగ్ పూల్ కపుల్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 
 
అది చూసిన నటాలియా దంపతులు స్విమ్మింగ్ పూల్ లోకి దిగి సేదతీరుతున్నారు. అంతలోనే రిసార్టు నిర్మానుష్యంగా ఉందని గమనించి, ఇద్దరూ స్విమ్మంగ్ పూల్‌లోనే శృంగారం ప్రారంభించారు. లోకం మైమరిచి ఇద్దరూ రాసక్రీడల్లో మునిగితేలారు. అయితే ఇంతలోనే స్విమ్మింగ్ పూల్‌లో అడుగు భాగంలో నెమ్మదిగా ఏదో జీవరాశి కదులుతున్న ఫీలింగ్ ఇద్దరికీ కలిగింది. అయినప్పటికీ పట్టించుకోని దంపతులు అలాగే తమ పనిలో నిమగ్నమయ్యారు.
 
అయితే కాసేపటికీ గాఢంగా హత్తుకున్న దంపతులు మధ్య నుంచి పాము బుసలు కొడుతూ లేచింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనా నటాలియా దంపతులకు ఏంచేయాలో అర్థం కాలేదు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి వల విసిరి పామును బంధించారు. నటాలియా దంపతులు బతుకు జీవుడు అంటూ పరుగు పరుగున తమ కాటేజీలోకి పరుగులెత్తుకుంటూ వెళ్లిపోయారు.