ఎంత పే...ద్ద పామో...!
దక్షిణ థాయ్ ల్యాండ్ వాసులు భారీ పాముని చూసి ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ థాయ్ ల్యాండ్ లోని క్రాబి ప్రావిన్స్ లో 15 అడుగుల కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది.
సమీపంలోని అడవుల నుంచి జనావాసాలలోకి వచ్చేసిన ఈ భారీ సర్పం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది చివరకు స్నేక్ ఫౌండేషన్ వారు వచ్చి దానికి పట్టుకుని సమీపంలోని అడవిలో వదిలేశారు.