బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (08:23 IST)

పెద్దగా చదువుకోకపోయినా మంత్రి పదవి : సత్యవతి

తాను చిన్న తండా నుంచి వచ్చినా, పెద్దగా చదువుకోకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఆశీర్వదించి మంత్రి పదవి ఇచ్చారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ చెప్పారు.

బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తాను చదువుకోసం పడిన కష్టాలను వివరించారు.

తాను చిన్న తండాలో పుట్టానని, అక్కడ పాఠశాల లేకపోవడంతో వేరే ఊరికి నడిచి వెళ్లి ఏడో తరగతి వరకు చదువుకున్నానని, అప్పట్లో హాస్టళ్లు ఎక్కువగా లేకపోవడంతో, తల్లిదండ్రులు ఎక్కువ చదివించలేక ఏడో తరగతి పూర్తి కాగానే పెళ్లి చేశారని మంత్రి చెప్పారు.

చదువు లేకపోవడంవల్ల కలిగే కష్టం తనకు తెలుసనీ చెప్పారు. తాను ఎమ్మెల్యే అయ్యాక తన నియోజకవర్గానికి పాఠశాలలు, కాలేజీలు తెచ్చే ప్రయత్నం చేశానని అన్నారు. ఆడపిల్లల విద్య కోసం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని సత్యవతి చెప్పారు.