1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Malala Yousafzai marries partner Asser Malik

నిరాడంబరంగా మలాలా యూసఫ్‌జాయ్ వివాహం

Malala Yousafzai
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. అస్సర్‌ అనే యువకుడితో యూసఫ్‌ జాయ్‌ వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది.

బర్మింగ్‌హామ్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అస్సర్‌ను నిఖా చేసుకున్నారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. 'ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్‌, నేను జీవిత భాగస్వాములమయ్యాం.
 
బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మాకు మీ ఆశీస్సులు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం' అని ట్విటర్‌లో పోస్టు చేశారు. తన నిఖా వేడుకకు సంబంధించిన ఫొటోలను అందులో ఉంచారు.
తర్వాతి కథనం
19 మంది మహిళలను మోసం చేసిన 'పియానో' విలియన్స్ అరెస్టు