గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (10:43 IST)

డిసెంబర్‌లో అలియా-రణ్‌బీర్‌లు పెళ్లి ఖాయమా? రాజస్థాన్ ప్యాలెస్‌లో..?

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌లు ఈ ఏడాదే వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారనే వార్త గత కొంతకాలంగా వినిపిస్తోంది. వీరి పెళ్లి అంశం మరోసారి బి-టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ డిసెంబర్‌లో అలియా-రణ్‌బీర్‌లు పెళ్లి ఖాయమని, రాజస్థాన్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
రాజస్థాన్‌లోని ఐకానిక్‌ ప్యాలెస్‌ హోటల్‌లో ఈ జంట డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేశారట, ఇందుకు ఇరు కటుంబ సభ్యులు కూడా ఏర్పాట్లు స్టార్ట్‌ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. 
 
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరపుకుంటోంది. ఆలోపు 'బ్రహ్మాస్త్ర' మూవీ పనులతో పాటు మిగతా ప్రాజెక్ట్స్‌ను కూడా పూర్తి చేసే బిజీగా ఉన్నారట రణ్‌బీర్‌-అలియా. అయితే పెళ్లి తేదీపై మాత్రం క్లారిటీ లేదు. 
 
గతంలో నటి లారా దత్త సైతం వీరి పెళ్లిపై స్పందిస్తూ 2021 డిసెంబర్‌లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుందని, 2020లోనే జరగాల్సిన వీరి పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.