శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (13:56 IST)

కన్నబిడ్డ ముందు పెళ్లి చేసుకున్న ప్రేమికులు.. ఇదో వెరైటీ వెడ్డింగ్!

తమిళనాడులోని కడలూరులో జరిగిన పెళ్లి గురించి మీరెప్పుడూ విని వుండరు. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని విరుదాచలం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వేల్‌మురుగన్ అనే 36 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన సత్య అనే 27 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్ల నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. 
 
అయితే.. వేల్‌మురుగన్ ఆమెను ప్రేమ పేరుతో నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో.. కంగారుపడిన వేల్‌మురుగన్ పెళ్లికి ముందే బిడ్డ పుడితే ఇద్దరినీ తప్పుగా అనుకుంటారని.. అబార్షన్ చేయించుకోవాలని ఆమెకు సూచించాడు.
 
అయితే.. అందుకు ఆమె ససేమిరా అనడం, తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో కొన్నాళ్లు ఆమెతో గడిపి, అవసరం తీరిపోయాక వదిలేద్దామని భావించిన వేల్‌మురుగన్ ప్లాన్ బెడిసికొట్టింది. కొన్ని రోజుల క్రితం సత్య ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. 
 
చివరికి ఒకానొక సమయానికి ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది. సత్యకు నెలలు నిండటంతో పురిటినొప్పులు వచ్చాయి. దీంతో.. ఆమెను తల్లిదండ్రులు ఆమెను విరుధచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఈ సమయంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
 
హాస్పిటల్ నర్స్ ఆ బిడ్డ జననాన్ని నమోదు చేసేందుకు బాబు తండ్రి పేరు ఏంటని సత్యను అడిగింది. దీంతో.. సత్య నిజాన్ని చెప్పక తప్పలేదు. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలుసుకున్న హాస్పిటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి వచ్చి సత్యను విచారించి జరిగిందంతా తెలుసుకున్నారు. వేల్‌మురుగన్‌ను కూడా విచారించారు. సత్య చెప్పిన విషయమంతా నిజమేనని తేలింది. దీంతో.. పోలీసులు ఆమెను మోసం చేస్తే అరెస్ట్ చేస్తామని.. జైలుకెళ్లక తప్పదని అతనికి వాస్తవ పరిస్థితిని వెల్లడించారు. 
 
దీంతో.. సత్య ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. పెళ్లికి ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది. పోలీసులు అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. వేల్‌మురుగన్, సత్య పెళ్లి విరుధచలంలోని ఓ ఆలయంలో గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది. తల్లిదండ్రుల పెళ్లిలో ఆ బిడ్డ కూడా భాగమయ్యాడు. ఆ పిల్లాడిని తల్లి ముందు ఉంచి వేల్‌మురుగన్‌తో సత్యకు తాళి కట్టించారు.