శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (11:35 IST)

తెట్టేకుంటలో ప్రేమ జంట ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా అనుముల మండలం తెట్టేకుంటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు (21), సంధ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట విషాదాంతకరమైన నిర్ణయం తీసుకుంది.
 
ఈ ఇద్దరు ప్రేమికులు రెండు రోజుల క్రితం ఇద్దరు తెట్టేకుంట సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గుర్తించిన స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.