శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (15:53 IST)

పండగపూట ఇంటికి రాని భర్త.. భార్య ఆత్మహత్య

పండగ పూట భర్త ఇంటికి రాకపోవడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం ఆమనగల్లులో జరిగింది. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు మేడిగ్డడుకు చెందిన వడ్త్యావత్ మౌనిక (20)కు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు అనిల్‌తో గత ఆర్నెల్ల క్రితం వివాహం జరిగింది. 
 
అనిలి డీఎంసీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే, దసరా పండుగకు ఇంటికి రాలేనని భార్య మౌనికకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య.. పొలానికి వెళ్లి పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటిరే ఆమె మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.