ఐరాసలో ప్రధాని స్పీచ్.. హాలు నుంచి వెళ్లిపోయిన నేతలు.. కారణం ఏంటంటే? (వీడియో)
Benjamin Netanyahu
మరోవైపు, ఈ విస్తృత ప్రాంతీయ సంఘర్షణలో అనేక సాయుధ బృందాలు, దేశాలు పాలుపంచుకుంటుండటంతో, పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది. దీంతో ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఒక చేదు సంఘటన జరిగింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ మందిరంలో ప్రసంగించడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు లేచిన వెంటనే, పలు దేశాల ప్రతినిధులు ఆ ప్రాంగణాన్ని విడిచి వెళ్ళిపోయారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే, వివిధ దేశాల ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ హాలును విడిచి వెళ్ళిపోవడం ఇజ్రాయెల్ ప్రతిష్టను మంటగలిపింది.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. "నేను ప్రారంభించే ముందు, ఒక చిన్న ప్రకటన. ఈ హాలు నుండి ఇంకా వెళ్ళని నైతిక పిరికివాళ్ళు ఎవరైనా ఉంటే, దయచేసి ఇప్పుడే వెళ్ళండి. చాలా ధన్యవాదాలు." అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రాకతో హాలు దాదాపు పూర్తిగా ఖాళీ అవుతున్న ఈ వీడియో, పాలస్తీనా, ఇతర ప్రాంతాలలో ఆ దేశం చేస్తున్న మానవ నష్టాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయాన్ని సూచిస్తుందనే చెప్పాలి.
#WATCH | New York | Delegates from various countries leave the UN General Assembly hall as Israeli Prime Minister Benjamin Netanyahu begins his speech
— ANI (@ANI) September 24, 2026
Israeli Prime Minister Benjamin Netanyahu says, "Before I begin, just a quick announcement: if there are any other moral cowards… pic.twitter.com/CBbFqwpEOe
