1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Should have won Nobel Prize 8 times: Donald Trump

ఎనిమిది యుద్ధాలు ఆపాను ..8 నోబెల్ శాంతి పురస్కారాలు రావాలి: డోనాల్డ్ ట్రంప్

donald trump
తనకు ఇప్పటివరకు ఎనిమిదిసార్లు నోబెల్ శాంతి పురస్కారాలు రావాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రతిష్టాత్మక శాంతి పురస్కారం ఎంపికలో ఈసారి కూడా తన పేరును పరిగణనలో తీసుకోకపోవడంపై నార్వేను తప్పుబట్టారు. శుక్రవారం సిరక్యూజ్‌లో ఒక సభలో ఆయన ప్రసంగించారు. 
 
'అధ్యక్షుడిగా అమెరికాకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. శాంతి బహుమతి నాకు రావాలి. నార్వే నిర్ణయం అవమానకరం. ఇది ఆ దేశానికి, ఆ నిర్ణయం తీసుకున్నవారికి ఒక మచ్చగా మిగులుతుంది. నేను ఆపిన ప్రతి యుద్ధానికి ఒక్కో నోబెల్ బహుమతి చొప్పున రావాలి. అణ్వాయుధాలు కలిగిన భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగకుండా అడ్డుకుని ఐదు కోట్ల మంది ప్రాణాలను కాపాడాను. తీవ్రవాద భావజాలం కలిగిన కొద్దిమంది వ్యక్తుల వల్ల నోబెల్ శాంతి బహుమతి ప్రతిష్ట దెబ్బతింది. ప్రజాస్వామ్యానికి, నాగరికతకు వీరు వ్యతిరేకులు. నార్వే! మీరు మాకు ఈ బహుమతి ఇవ్వలేదనే విషయాన్ని మర్చిపోం' అని హెచ్చరించారు.
 
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన నవీ పిళ్లైపై ట్రంప్ స్పందించారు. "ఐక్యరాజ్యసమితిలో పనిచేసే, ఎవరికీ తెలియని ఓ ఉదారవాద వ్యక్తికి ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఆమె పేరు నేనెప్పుడూ వినలేదు. అయినా ఆమెకు నా అభినందనలు" అని చెప్పారు. తాను ఆపానంటున్న యుద్ధాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇరాన్ - అమెరికా, రష్యా - ఉక్రెయిన్ మధ్య సంఘర్షణలను కూడా ముగించే దిశగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పీజీ వైద్య విద్యార్థినిపై ఎంబీబీఎస్ విద్యార్థి అత్యాచారం...