1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. telangana : fourth year mbbs student sexual attack on pg medical student

పీజీ వైద్య విద్యార్థినిపై ఎంబీబీఎస్ విద్యార్థి అత్యాచారం...

crime news
తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల మండలంలో ఓ దారుణం జరిగింది. పీజీ వైద్య విద్యార్థినిపై ఆమె కళాశాలలోనే చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. అతని తీరుతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరరకు.. చేవెళ్లలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థినితో అదే కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న షాద్ నగర్ ప్రాంతానికి చెందిన రాహుల్ విద్యాపరమైన విషయాలపై మాట్లాడే నెపంతో పరిచయం పెంచుకున్నాడు.
 
అనంతరం ఓ సందర్భంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించేవాడు. 
 
బాధితురాలికి ఇటీవల మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకున్న నిందితుడు.. ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలను సదరు వ్యక్తికి పంపాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు కుటుంబీకుల సహకారంతో గురువారం రాత్రి తన స్వస్థలం ఖమ్మం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వారు అక్కడ జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి కేసును రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఠాణాకు బదిలీ చేశారు. శనివారం నిందితుడిని పట్టుకున్న ఇక్కడి పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండుకు తరలించారు. అతడి నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మీలో ఒకడిగా పుట్టలేదు.. కానీ మీలో ఒకడిని అయ్యాను : పవన్ కళ్యాణ్ (వీడియో)